వెట్టిచాకిరిలో మగ్గుతున్న బాలలకు ఖమ్మం జిల్లా అధికారులు విముక్తి కల్పించారు. వారిని రక్షించి చదువుకునేందుకు ఏర్పాట్లు చేశారు. బుధవారం రాత్రి చైన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో బాలకార్మికులను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఖమ్మం రైల్వే పోలీసులు, చైల్డ్‌లైన్ సిబ్బంది వారిని రక్షించారు. వీరంతా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాఘాట్‌కు చెందిన వారిగా తెలిపారు. రెండు నెలల క్రితం పని కోసం తమిళనాడు వెళ్లినట్లు వాళ్లు తెలిపారు. 29 మందిని బాలకార్మికులుగా గుర్తించగా.. ఇందులో 13 మంది అమ్మాయిలు, 16 మంది అబ్బాయిలు ఉన్నారు.
పెద్ద వారిని మధ్యప్రదేశ్ పంపి.. బాలికలను ఖమ్మంలో బాలల సదనం, అబ్బాయిలను పట్టణ వీధిబాలల కేంద్రానికి తరలించారు. ఉదయం పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఐటీడీఏ పీవో గౌతమ్, న్యాయసేవా సంస్థ న్యాయమూర్తి వినోద్‌కుమార్‌లు చిన్నారులతో మాట్లాడారు. ఖమ్మంజిల్లా కలెక్టర్.. బాలాఘాట్ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రేపు వారిని సొంత ప్రాంతానికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి: ' రైతులు అప్పులు చేసే పరిస్థితే ఉండొద్దు'