ఖమ్మం జిల్లా మధిరలో ధర్నా చౌక్ యథావిధిగా కొనసాగించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు దీక్షలు, ధర్నాలు చేస్తున్నారని అఖిలపక్షం నాయకులు బెజవాడ రవిబాబు అన్నారు. అయితే ప్రస్తుత పురపాలక పాలకవర్గం దీన్ని తొలగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... అఖిలపక్షం నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
ధర్నా చౌక్‌ను ఇక్కడే కొనసాగించే వరకు ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెజవాడ రవిబాబు, సేలం నరసింహారావు, మార్నింగ్ పుల్లారావు, వేణు, పాపట్ల రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'ఆటో డ్రైవర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి'