అధికార పార్టీ పోలీసుల సాయంతో తమ అభ్యర్థులను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిన గతంలో మేము చేసిన పనులు చూసి ఖమ్మం ప్రజలు ఆశీర్వదించారని... కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ అన్నారు. ఖమ్మం నగరంలో తమ పార్టీకి చెందిన పదిమంది కార్పొరేటర్లు విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఎన్నికల సందర్భంగా కనీసం అభ్యర్థులను ప్రచారం కూడా చేయనీయకుండా తెరాస నేతలు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. విజయం సాధించిన కార్పొరేటర్లకు అభినందనలు తెలిపి, వారిని సత్కరించారు. నిరంతరం ప్రజల సమస్యల పట్ల మిత్రపక్షం సీపీఎంతో కలిసి పోరాడుతామన్నారు.
ఇదీ చదవండి: 'తీవ్ర, అతి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారినే ఆస్పత్రిలో చేర్చుకోవాలి'