ETV Bharat / state

'మన సంక్షేమ పథకాలకు దేశమంతా ఆసక్తి' - తెలంగాణ తాజా వార్తలు

పార్లమెంట్​లో మన సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తే మిగతా రాష్ట్రంలోని ఎంపీలు ఆసక్తిగా గమనిస్తున్నారని ఖమ్మం పార్లమెంట్​ సభ్యుడు నామ నాగేశ్వరరావు అన్నారు. ఎమ్మెల్యే సండ్రతో కలిసి ముఖ్యమంత్రి సహాయనిధి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను పంపిణీ చేశారు.

mp nama
ఖమ్మంలో ఎంపీ నామ పర్యటన
author img

By

Published : Apr 16, 2021, 2:12 PM IST

రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను పార్లమెంట్​లో ప్రస్తావిస్తే మిగతా పార్టీల సభ్యులు ఆసక్తిగా గమనిస్తున్నారని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో పర్యటించారు. ముఖ్యమంత్రి సహాయనిధి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను పంపిణీ చేశారు. కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు.. చీరలు పంపిణీ చేశారు. ఈ ఏడాదిలోనే రూ.5 కోట్ల వరకు చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.

సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే సండ్ర కృషిచేస్తున్నారని.. ఎంపీ నామ ప్రశంసించారు. ఆ గుర్తింపుతోనే.. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించినట్లు చెప్పారు.

కరోనా సమయంలో.. రైతులను ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్​ను కోరినట్లు పేర్కొన్నారు. మల్లవరం గ్రామంలో ఓ బాధితుడికి రూ. 7.5 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును లబ్ధిదారుని ఇంటికి వెళ్లి అందించారు.

ఇవీచూడండి: ఏ రాష్ట్రంలో లేనివిధంగా దివ్యాంగులకు సంక్షేమ పథకాలు: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.