ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్‌లోని సెయింట్ మేరీస్ మిషన్ ఆస్పత్రికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరికరణాన్ని వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది నామకు కృతజ్ఞతలు తెలిపారు.
సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందిన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లోని చర్చి ఆఫ్ సౌత్ ఇండియా బిషప్ డాక్టర్ వాడపల్లి ప్రసాదరావు మృతి పట్ల నామ నాగేశ్వరరావు సంతాపం తెలిపారు.