ETV Bharat / state

ముగిసిన ఎంపీ నామ నాగేశ్వరరావు తల్లి వరలక్ష్మీ అంత్యక్రియలు - ఎంపీ నామనాగేశ్వరరావు తల్లి మృతి

తెరాస లోక్​సభాపక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు మాతృమూర్తి నామ వరలక్ష్మీ అంత్యక్రియలు ముగిశాయి. బంధువులు, రాజకీయ ప్రముఖులు, నామ అభిమానులు ఆమెకు తుదివీడ్కోలు పలికారు.

khammam mp nama nageshwara rao mother's cremation
ఎంపీ నామ నాగేశ్వరరావు తల్లి వరలక్ష్మీ అంత్యక్రియలు
author img

By

Published : Oct 3, 2020, 10:52 AM IST

తెరాస ఎంపీ నామ నాగేశ్వరరావు తల్లి నామ వరలక్ష్మీ అంత్యక్రియలు ముగిశాయి. బ్రెయిన్​ స్ట్రోక్​తో గురువారం రాత్రి హైదరాబాద్​లో మృతిచెందిన వరలక్ష్మీ పార్థివదేహాన్ని ఖమ్మంలోని నామ నివాసానికి తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బంధువులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వరలక్ష్మీకి నివాళులర్పించారు.

మంత్రి పువ్వాడ అజయ్ నామ నివాసానికి చేరుకుని వరలక్ష్మీ పార్థివదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్​తో పాటు తెరాస, తెదేపా, కాంగ్రెస్, భాజపా, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన జిల్లా నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం నామ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఖమ్మం గ్రామీణం మండలం గొల్లగూడెంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.