ETV Bharat / state

Khammam MLA Ticket Issues : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ జోష్​.. గులాబీ గూటికి చేరిన వారందరికీ టికెట్లు - ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన

Khammam MLA Ticket Issues : వచ్చే ఎన్నికల్లో ఎన్నికల జట్టు ఖరారు కావడంతో.. ఉమ్మడి ఖమ్మం అధికార బీఆర్​ఎస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఎన్నికలకు 100 రోజుల ముందే అభ్యర్థుల్ని ప్రకటించిన అధికార పార్టీ.. ఎన్నికల రణ క్షేత్రంలోకి దిగింది. ఒక్క నియోజకవర్గం మినహా.. అందరూ సిట్టింగులతోనే బరిలోకి దిగేందుకు సర్వసన్నద్ధమవుతోంది. మరోవైపు.. గత ఎన్నికల్లో వివిధ పార్టీల్లో గెలిచి.. అనంతరం గులాబీ గూటికి చేరిన వారందరికీ మళ్లీ టికెట్లు కట్టబెట్టి.. ఇచ్చిన మాట నిలుపుకుంది. అభ్యర్థుల ప్రకటనతో ఆయా నియోజకవర్గాల్లో.. పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిలేతుతుండగా.. టికెట్ ఆశించి భంగ పడ్డ ఆశావహుల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి.

Khammam MLA Ticket
Khammam MLA Ticket Issues
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2023, 10:26 AM IST

Khammam MLA Ticket Issues ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ జోష్​.. గులాబీ గూటికి చేరిన వారందరికీ మళ్లీ టికెట్లు

Khammam MLA Ticket Issues : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 శాసనసభ స్థానాలకు భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థులను ప్రకటించడంతో.. ఆయా నియోజకవర్గాల్లో గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. జిల్లాలో ప్రస్తుతం బీఆర్​ఎస్​కు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మధిర, భద్రాచలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. జిల్లాలోని 10 కి 10 స్థానాలకు బీఆర్​ఎస్(BRS MLA Tickets) అధినేత కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటించారు. వైరా మినహా మిగిలిన అన్ని స్థానాల్లో సిట్టింగులకు మళ్లీ అవకాశం కల్పించారు. వాస్తవానికి 2018 ఎన్నికల్లో బీఆర్​ఎస్ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది.

Khammam BRS MLS Candidates 2023 : రాష్ట్రవ్యాప్తంగా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన నలుగురు, టీడీపీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. గులాబీ గూటికి చేరారు. పార్టీలో చేరిన సమయంలోనే వచ్చే ఎన్నికల్లో మళ్లీ అందరికీ టికెట్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. పార్టీ పనితీరు, ప్రభుత్వ పనితీరు తోపాటు అభ్యర్థుల వ్యక్తిగత పనితీరుపై వివిధ రకాల సర్వేలు నిర్వహించి.. చివరకు ఇచ్చిన హామీ ప్రకారం కేసీఆర్ సిట్టింగులందరికీ మళ్లీ సీట్లు కేటాయించేందుకు మొగ్గుచూపారు. దీంతో.. మళ్లీ పాత జట్టుతోనే బీఆర్​ఎస్ రాబోయే ఎన్నికలకు సమరశంఖం పూరించింది.

Thatikonda Rajaiah Crying for MLA Ticket : కార్యకర్తల ముందే బోరున విలపించిన MLA రాజయ్య.. వీడియో వైరల్

Khammam BRS Politics : వైరా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్​కు (BRS MLA Tickets Issues in Khammam) బీఆర్​ఎస్ ఝలక్ ఇచ్చింది. పార్టీ సర్వే నివేదికల్లో సానుకూలత లేమితోనే పార్టీ రాములు నాయక్​ను పక్కనబెట్టిన బీఆర్​ఎస్.. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ అభ్యర్థిత్వం ఖరారు చేసింది. భద్రాచలం నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్ అభ్యర్థిగా తెల్లం వెంకట్రావు బరిలోకి దిగనున్నారు. ఇటీవల బీఆర్​ఎస్​ను వీడి పొంగులేటితోపాటు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తెల్లం వెంకట్రావు.. నెల రోజులు గడవక ముందే మళ్లీ సొంత గూటికి చేరడంతో మళ్లీ భద్రాచలం సీటు వరించింది.

"నేను మంత్రిని కాబట్టి నా నియోజక వర్గాలన్నీ తిరిగి ఎమ్మెల్యేలను గెలిపించాలి. గతంలోలా ఒక్క నియోజకవర్గంలో గెలుపొందినట్టు కాకుండా.. అత్యధిక స్థానాల్లో బీఆర్​ఎస్​ పార్టీ గెలుపొందేలా చేయాలి. అలా చేయడానికి నేను పక్కా నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారం చేయాల్సిన బాధ్యత మీరు కూడా తీసుకోవాలి. నామినేషన్​ వేసే వరకు మనం ఖాళీగా కూర్చోవద్దు. ఆ సమయానికల్లా ప్రతి ఇంటికి మూడూ సార్లు తిరిగి రావాలి." - పువ్వాడ అజయ్ కుమార్​ రవాణాశాఖ మంత్రి

జోష్​లో మంత్రి పువ్వాడ అజయ్: ఇక బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థుల ప్రకటన మరుసటి రోజు నుంచే.. పలు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నికల శంఖారావం పూరించారు. నియోజకవర్గ ముఖ్యనాయకులతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. బూతు స్థాయి నాయకులు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో (Minister puvvada Meeting in Khammam) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులు ఎన్నికలకు కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. మిగలిన నియోజకవర్గాల్లోనూ... పార్టీ అభ్యర్థులు ఎన్నికల కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత ఆయా నియోజకవర్గాలకు చేరుకుంటున్న ఎమ్మెల్యేలు, నేతలు.. ఎన్నికల కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.

"కేసీఆర్​ .. ఆశించిన వారికి తప్పనిసరిగా ఏది చేయాలో అది చేస్తారు. వారిని నమ్మి వారి నాయకత్వాన్ని బలపరిచిన వారిని తప్పకుండా చేస్తారు. గతంలో నమ్మి వచ్చిన వారికి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్​ ఇచ్చారు. రాజకీయ పదవుల విషయంలో మాట ఇస్తే ఎన్ని వచ్చినా తప్పకుండా మాట నిలబెట్టుకుంటారు." - సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లి ఎమ్మెల్యే

BRS MLA Tickets Telangana 2023 : మరోవైపు.. అభ్యర్థుల ప్రకటనతో జిల్లాలో పలు నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. పలువురు నేతలు టికెట్ ఆశించి భంగపడటంతో.. వారి అనుచరగణం అసమ్మతికి తెరలేపుతున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెేం. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు అభ్యర్థుల జాబితాలో చోటు దక్కకపోవడంతో వారి అనుచరవర్గం రగిలిపోతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు జిల్లా రాజకీయాల్లో ఉద్ధండ నాయకుడిగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో పాలేరు బీఆర్​ఎస్​ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కందాల బీఆర్​ఎస్​ గూటికి చేరారు. అయినప్పటికీ తుమ్మల నాగేశ్వరరావు సంయమనంతో ఉన్నారు. నియోజకవర్గంతోపాటు.. జిల్లావ్యాప్తంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ ఇస్తారన్న నమ్మకంతో ఉన్నారు. కానీ.. అనూహ్యంగా మళ్లీ కందాలకే టికెట్ దక్కడంతో.. తుమ్మల రాజకీయ భవిష్యత్తు ఏంటన్న ప్రశ్న.. ఉత్పన్నమవుతోంది. తుమ్మలకు టికెట్ రాకపోవడంతో.. పాలేరు నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్​ఎస్​ ముఖ్య నాయకులు, తుమ్మల అనుచరులు ఖమ్మం గ్రామీణం మండలంలోని సత్యనారాయణ పురంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పాలేరు బరిలో తుమ్మల ఉండాల్సిందేనని తీర్మానించారు. కొత్తగూడెం నుంచి ఈ సారి టికెట్ తనకే దక్కుతుందని ఆశించిన జలగం వెంకట్రావుకు సైతం.. టికెట్ దక్కకపోవడంతో.. ఆయన వర్గీయులు భవిష్యత్తు రాజకీయ పయనంపై త్వరలోనే సమావేశానికి సిద్ధమవుతున్నారు.

Left parties on BRS MLAs List 2023 : 'కేసీఆర్​కు బీజేపీతో దోస్తీ కుదిరింది.. అందుకే ఈ మోసం'

Harish Rao Telangana Elections 2023 : 'ఉమ్మడి మెదక్ జిల్లాలో 10స్థానాలు గెలిచి.. కేసీఆర్​కు కానుక ఇస్తా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.