ETV Bharat / state

దళారుల పాలవుతున్న రైతు కష్టం - మిర్చి సాగుదార్లను నిండా ముంచుతున్న అడ్డగోలు కొనుగోళ్లు

Khammam Mirchi Farmers Price Problems : ఖమ్మం మిర్చి రైతుల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. జెండా పాటకు వేల వ్యత్యాసంతో వ్యాపారులు మిర్చి కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో చాలా నష్టాలు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. మిర్చి మార్కెట్​ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన గిట్టుబాటు ధరకే కొనుగోళ్లు చేయాలని వ్యాపారులకు సూచించారు.

Minister Tummala Visit To Khammam Mirchi Market
Khammam Mirchi Farmers Issues
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2024, 2:40 PM IST

Khammam Mirchi Farmers Price Problems : అన్నదాత కష్టం వ్యాపారుల పాలవుతోంది. రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన పంట కర్షకులకు కన్నీళ్లు పెట్టిస్తుంటే, కడుపులో చల్ల కదలకుండా మార్కెట్​లో తిష్ట వేసిన వ్యాపారులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. ఖమ్మం మిర్చి మార్కెట్​లో అడ్డగోలుగా సాగుతున్న కొనుగోళ్లు సాగుదారులను నిండా ముంచుతున్నాయి. పేరుకే ఊరిస్తున్న మిరప ధరలు, అన్నదాతకు మాత్రం చేతికందడం లేదు. మరోవైపు రేపటి నుంచి మార్కెట్​కు సెలవులు తావడంతో, ఖమ్మం మిర్చి మార్కెట్​కు ఇవాళ భారీ ఎత్తున మిర్చి పంట పోటెత్తింది.

మిర్చి సాగుదార్లను నిండా ముంచుతున్న అడ్డగోలు కొనుగోళ్లు

శనివారం నుంచి సెలవులు కావడంతో వ్యాపారులందరూ కుమ్మక్కై మిర్చి ధరలు అమాంతం తగ్గించి కొనుగోళ్లు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం రూ.23వేలు పలికిన జెండా పాటను ఏకంగా రూ. 2వేలు తగ్గించి కేవలం రూ.19వేల లోపే పంటను కొంటున్నారు. వ్యాపారుల వైఖరితో తాము ఎంతో నష్టపోతున్నామంటూ కర్షకులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఖమ్మం మిర్చి మార్కెట్​లో వ్యాపారులు మాయాజాలంతో చిత్తవుతున్న మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

Khammam Mirchi Market: మిర్చి రైతుల కష్టాలు తీరేదెన్నడు...?

"జెండా పాట రూ.21వేలు పలుకుతున్నా పదహారు వేల నుంచి కొంటున్నారు. మిర్చి పెద్దగా ఉండి డ్రైగా ఉంటే జెండా పాటకు కొంటున్నారు. గిట్టుబాటు ధర అస్సలు రావడం లేదు. పంట వేసినప్పుడు పురుగు పట్టి దిగుబడి తగ్గింది. ఇక్కడికి వచ్చాక గిట్టుబాటు ధర రావడం లేదు. మాకు నష్టం తప్ప లాభం లేదు." - రైతులు

Minister Tummala Visits Khammam Mirchi Market : మిర్చి రైతుల గోస గురించి తెలుసుకున్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా ఇవాళ ఖమ్మం మిర్చి యార్డును సందర్శించారు. గిట్టుబాటు ధరకే మిర్చి కొనుగోలు చేయాలని వ్యాపారులకు ఆయన సూచించారు. ఖమ్మం మిర్చి మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, కొనుగోళ్లను స్వయంగా పరిశీలించారు.

Khammam Mirchi Farmers Issues ఖమ్మం మిర్చి మార్కెట్​లో వ్యాపారుల దోపిడీ - మంత్రి తుమ్మల ఫైర్

మార్కెట్​కు వచ్చిన మంత్రి తుమ్మలతో మిర్చి రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. మిర్చి ధరలు గణనీయంగా తగ్గిస్తున్నారని ఆయనకు చెప్పారు. కర్షకులతో మాట్లాడిన మంత్రి వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మార్కెట్​లో జరుగుతున్న అవకతవకలను సమీక్షించారు. పర్యవేక్షణ కరవైందంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో జాప్యం చేయకూడదని, అన్నదాతలకు వెంటనే చెల్లింపులు చేయాలని వ్యాపారులకు సూచించారు.

"చూపించడం వరకు ఇరవై వేలు చూపిస్తున్నారు. కొనడం మాత్రం పదహారు, పదిహేడు వేలకు కొంటున్నారు. ధరల మధ్య వ్యత్యాసం ఇంతగా ఉండకూడదు. వంద, రెండు వందలు ఉంటుంది. కానీ వేల రూపాయల వ్యత్యాసం రాకూడదు. తక్కువ రేటువి ఎక్కువ కొంటున్నారు. జెండా పాటవి తక్కువ కొంటున్నారు." - తుమ్మల నాగేశ్వర్​రావు, వ్యవసాయశాఖ మంత్రి

Tummala Fires on Khammam Mirchi Market Officials : ఖమ్మం మిర్చి మార్కెట్​లో జరుగుతున్న అవకతవకలపై కార్యాలయంలో అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. దీనికి మార్కెటింగ్​శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అధికారులు హాజరయ్యారు. మిర్చి కొనుగోళ్లు సాగుతున్న తీరుపై, జెండా పాటకు, రైతుకు దక్కే ధరకు పొంతన లేదని మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పొట్ట కొడితే సహించేది లేదంటూ అధికారులను హెచ్చరించారు.

నాణ్యతను వ్యాపారులు ఎలా నిర్ధారిస్తారని అధికారులను మంత్రి ప్రశ్నించారు. రైతులకు ఇబ్బంది కలిగించే చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. కర్షకులకు న్యాయం జరిగేలా ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం మార్కెట్‌కు కొత్త కార్యదర్శులను నియమిస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కొనుగోళ్లను పరిశీలించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర అందేలా పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు.

Mirchi farmers problems: మిర్చి రైతుల్ని ముంచిన తామర తెగులు.. దిగుబడి లేక నష్టాలు

మిర్చి మంటలు - జెండాట కొండంత - వ్యాపారుల ధర గోరంత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.