ETV Bharat / state

Khammam Floods 2023 : శాంతించిన మున్నేరు.. కోలుకుంటున్న ఖమ్మం.. ఇళ్లకు చేరుకుంటున్న బాధితులు - భద్రాద్రిలో పెరుగుతున్న గోదావరి నది ప్రవాహం

Flood Effect on Khammam District Rains 2023 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరదలు కాస్త తగ్గాయి. ఉగ్రరూపం దాల్చిన మున్నేరు నది 30 అడుగులుగా ప్రవహించింది. రెండు రోజుల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నది ప్రవాహం శుక్రవారం 22 అడుగులకు చేరింది. మరోవైరు భద్రాద్రిలో మూడో హెచ్చరిక కొనసాగుతుంది. తెలంగాణ - ఛత్తీస్‌గఢ్‌ మధ్య రాకపోకలు నిలిచి పోయాయి.

Khammam
Khammam
author img

By

Published : Jul 29, 2023, 8:37 AM IST

ఖమ్మంలో తగ్గిన వరద ఉద్ధృతి... భద్రాద్రిలో కొనసాగుతున్న మూడో హెచ్చరిక

Khammam Rains 2023 : రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజులుగా కురిసిన వర్షాలకు ప్రజలు అల్లాడి పోయారు. ఇళ్లలోకి నీరు చేరడంతో నానా ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను వరదలు ముంచెత్తాయి. గత రెండు రోజుల నుంచి వర్షాలు తగ్గడం వల్ల ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఖమ్మంలో ఉగ్రరూపం దాల్చిన మున్నేరు నది శాంతించడంతో బాధితులు.. తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగానే ప్రవహిస్తోంది. మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Khammam Floods 2023 : వరదల ఉద్ధృతితో ఉమ్మడి ఖమ్మం జిల్లా విలవిల్లాడింది. ఉభయ జిల్లాల్లో వరుణుడి జోరు లేకున్నా.. వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉప్పొంగిన వాగులతో రాకపోకలు స్తంభించాయి చాలా ఏళ్ల తర్వాత ఖమ్మం నగరంలో మున్నేరు మహోగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరదతో ఖమ్మంలోని మున్నేరు ప్రభావిత కాలనీలు వణికిపోయాయి.

ఉభయ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రెండు జిల్లాల్లో అధికార యంత్రాంగం, కలెక్టర్లు, పోలీస్ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 4వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. దాదాపు 1000 ఇళ్లను ఖాళీ చేయించారు.

"మేము ఇక్కడ ఉండి 30 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటివరకు రెండు సార్లు ఇళ్లలోకి నీరు వచ్చాయి. ఇంతక ముందు వరకు రోడ్డు పైకి వచ్చి పోయేవి. బియ్యం, బట్టలు, వంట వస్తువులు అన్ని పారేశాం. ఏం లేకుండా అయ్యింది ఇంట్లో పిల్లల పుస్తకాల దగ్గర నుంచి అన్ని తడిసిపోయాయి.' - బాధితురాలు

తగ్గిన మున్నేరు నది ప్రవాహం : ఉగ్రరూపం దాల్చిన మున్నేరు నది కాస్త శాంతించింది. గురువారం 30 అడుగుల మేర ఖమ్మం వద్ద ప్రవహించిన మున్నేరు నది... శుక్రవారం 22 అడుగులకు చేరింది. ప్రధానంగా బొక్కల గడ్డ, వెంకటేశ్వర కాలనీ, పద్మావతి నగర్ గృహాలు ధ్వంసం అయ్యాయి. కుటుంబానికి సుమారు లక్ష వరకు నష్టపోయామని.. బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 3 వేల 500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వారంతా భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, అశ్వాపురం, మణుగూరు, పినపాక, గుండాల కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలాలకు చెందిన వారు. వరద పూర్తిగా తగ్గిపోయి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు... ముంపు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలలోనే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ - ఛత్తీస్‌గఢ్‌ మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని ఇల్లందులపాడు చెరువు అలుగు పోస్తుండగా పట్టణ వాసులు... అలుగు అందాలను చూసి తన్మయత్వం చెందుతున్నారు. ఇల్లందు మున్సిపల్ ఆధ్వర్యంలో.. ఏర్పాటు చేసిన లైటింగ్‌తో నీటి ప్రవాహం కనువిందు చేస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.