ఖమ్మం నగరంలోని పెవిలియన్ మైదానంలో కలెక్టర్ ఆర్వీకర్ణన్ ప్లాస్టిక్ మార్పిడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి, ప్రజల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు.
ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి, వాటి బరువును బట్టి మొక్కలు, వస్త్ర సంచులు అందజేశారు. మూడు కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకువచ్చిన వారికి ఆహార కూపన్లు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని కలెక్టర్ తెలిపారు.
- ఇదీ చూడండి: మున్సిపల్ ఎన్నికలకు పార్టీల కసరత్తు