ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియను గ్రామస్థాయి నుంచి చేపట్టాలని కార్యకర్తలకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్ సూచించారు. వైరాలో నియోజకవర్గ స్థాయి నాయకులు, బాధ్యులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కార్యకర్తలు కొత్త ఓటర్లను ఎక్కువ శాతం నమోదు చేయించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, వైఫల్యాలను వివరించి పట్టభద్రులను చైతన్య పరచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు దాసరి దానియేల్, ఐదు మండలాల కాంగ్రెస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : బంగారు, వెండి జరీతో బతుకమ్మ చీరలు: శైలజ రామయ్యర్