ఖమ్మం నగరంలో నిర్మిస్తున్న ఐటీ హబ్ జిల్లా యువతకు ఒక వరమని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. మంగళవారం.. పనుల తీరును పరిశీలించారు. హబ్ ఇన్ఛార్జితో కలిసి అన్ని అంతస్తులు తిరిగారు. కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
ఖమ్మం ఐటీ హబ్లో అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు చెందిన బహుళజాతి సంస్థలు తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయని పాలనాధికారి తెలిపారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయని.. సంస్థలను ఏర్పాటుచేసేందుకు అనుకూల వాతావరణం ఉందని.. బహుళజాతి సంస్థల ప్రతినిధి అన్నారు.
ఇవీచూడండి: బల్దియా పోరు: ఓటర్లలో అదే నిర్లిప్తత... కారణాలు అవేనా?