ETV Bharat / state

ఖమ్మం నగరపాలకంలో ఊపందుకున్న అభివృద్ధి పనులు - khammam news

ఖమ్మం నగరపాలకంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. పాలకపెద్దలు ఆదేశాలు జారీచేయడం వల్ల అధికారులు ఆగమేఘాల మీద పనులు చేస్తున్నారు. ఆరునెలల్లో నగర పాలకవర్గ పదవీకాలం ముగియనున్న తరుణంలో అభివృద్ధి పనులు చేసి ప్రజల వద్దకు వెళ్లాలని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.

Improved development works in Khammam municipal corporation
ఖమ్మం నగరపాలకంలో ఊపందుకున్న అభివృద్ధి పనులు
author img

By

Published : Sep 4, 2020, 8:20 AM IST

ఖమ్మం నగరపాలకంలో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. అన్ని ప్రధాన రహదారులపై డివైడర్లు.. వాటిల్లో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలని పాలకపెద్దలు ఆదేశాలు జారీచేయడం అందుకనుగుణంగా అధికారులు ఆగమేఘాల మీద టెండర్లు నిర్వహించడం, పనులు ప్రారంభించడం చకచకా జరిగిపోతున్నాయి. ప్రస్తుత నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు వచ్చే ఏడాది మార్చి 15తో ముగియనుంది. గతేడాది మార్చిలో ఖమ్మం గ్రామీణ మండలంలోని ఆరు పంచాయతీలను నగరపాలక సంస్థలో విలీనం చేయడం, ఆ తరువాత ప్రస్తుతం ఉన్న 50డివిజన్లను 60 డివిజన్లుగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాజపత్రం కూడా విడుదల చేసింది.

అభివృద్ధి పనులపై సమీక్షలు

గత మూడు నెలలుగా దశలవారీగా ఖమ్మం నగరపాలకంలో చేపట్టిన అభివృద్ధి పనులపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇదే సమయంలో విలీన పంచాయతీలకు సైతం అభివృద్ధి నిధులు కేటాయించారు. చేపట్టిన అన్ని పనులు నిర్ధేశించిన సమయంలోగా పూర్తిచేయాలని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీచేశారు. మేయర్‌, కమిషనర్‌లు కూడా ప్రతి వారం పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. మూడేళ్లుగా ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుంచి చేపట్టిన రూ.300కోట్ల పనులు, రూ.55కోట్ల ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులు, రూ.25కోట్ల నగరపాలక సంస్థ సాధారణ నిధులతో చేపడుతున్న పనులను వేగవంతం చేస్తున్నారు. గోళ్లపాడు కాలువ ఆధునికీకరణ, మిషన్‌భగీరథ, నూతన బస్టాండ్‌, ఐటీహబ్‌, మార్కెట్‌ల నిర్మాణం, నగరపాలక సంస్థ నూతన భవన నిర్మాణం, ధంసలాపురం రైల్వే ఓవర్‌ వంతెన పనులు జోరుగా సాగుతున్నాయి.

డివిజన్ల పునర్విభజనపై విడుదల కాని మార్గదర్శకాలు

నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉండగా, గతేడాది 60 డివిజన్లు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే పాలేరు నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి గ్రామీణ మండలానికి చెందిన పంచాయతీల విలీనాన్ని నిలుపుదల చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో డివిజన్ల పునర్విభజనకు బ్రేక్‌పడిందన్న వాదన ఆయా వర్గాల్లో వ్యక్తమవుతోంది. మేయర్‌ పీఠం జనరల్‌ మహిళకు రిజర్వు కావడం వల్ల నగరాన్ని 60 డివిజన్లుగా పునర్విభజించడం ఖాయమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కరోనా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టిన అనంతరం పునర్విభజన ప్రక్రియ ప్రారంభించాలన్న ఆలోచనతో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఓ నేత పేర్కొన్నారు. ఇదే సమయంలో అభివృద్ధి పనులన్నింటిని పూర్తిచేస్తే, ప్రజల వద్దకు వెళ్లే అవకాశం ఉంటుందని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి: రైతు వేదిక పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.