ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటివద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడం ప్రాంగణమంతా సందడిగా మారింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యకర్తలకు, అభిమానులకు మిఠాయిలు తినిపించారు. పొంగులేటి నాయకత్వం వర్ధిల్లాలంటూ అభిమానులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఇంతవరకు స్తబ్దుగా ఉన్న ఆయన వద్దకు జిల్లా వ్యాప్తంగా అభిమానులు భారీ సంఖ్యలో రావడం చర్చనీయాంశమైంది.