కొరవడిన ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణ... నిబంధనలను గాలికొదిలేసిన తాత్కాలిక సిబ్బంది, ప్రైవేటు బస్సు సర్వీసుల యజమానులు... వెరసి ప్రయాణికుల జేబులకు భారీగా చిల్లుపడుతోంది. పండుగకు సొంతూళ్లకు వెళ్లి... తిరుగు ప్రయాణమైన ప్రజలు... ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న అధిక ఛార్జీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టికెట్లు లేక, లెక్కాపత్రం లేని ఛార్జీల వసూలుతో...... తాత్కాలిక సిబ్బంది జులుం ప్రదర్శిస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తుండడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: ప్రజలు గమ్యస్థానాలకు ఎలా వెళ్తున్నారు: హైకోర్టు