ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యా తండాలో దండు వేడుకలు నిర్వహించారు. ఉదయం కామ దహనం అనంతరం వేడుకలను ప్రారంభించారు. హోళీ వేడుకల్లో పాల్గొని కోలాటం, రంగోలి అనంతరం పోయిన హోలీ నుంచి ఈ హోలీ వరకు పుట్టిన పిల్లలకు కోలాటం వేస్తూ అన్నప్రసాన చేశారు.
కొత్త బట్టలు వేసుకుని ప్రతి ఇంట్లో గొర్రెపోతును బలిచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మూడు రోజుల పాటు పండుగ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు.
ఇదీ చూడండి: సినిమాలో విలన్లు ఐఫోన్ అందుకే వాడరట