ETV Bharat / state

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా వర్షాలు - Heavy rains in union khammam

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం జోరుగా వర్షాలు కురిశాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు, సాగునీటి వనరులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

Heavy rains in union khammam district
Heavy rains in union khammam district
author img

By

Published : Jul 24, 2020, 11:01 AM IST

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో గురువారం ఏకధాటిగా వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా సగటు వర్షపాతం 22.5 మి.మీగా నమోదైంది. 13 మండలాల్లో భారీ వర్షం, రెండు మండలాల్లో సాధారణ వర్షం నమోదైంది. ఖమ్మం జిల్లాలో సగటు వర్షపాతం 6.6 మి.మీగా నమోదైంది. 6 మండలాల్లో భారీ వర్షం, మరో 9 మండలాల్లో సాధారణ వర్షం కురిసింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా వర్షాలు

పొంగిన వాగులు, వంకలు..

భారీ వర్షాలతో ఉభయ జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు, సాగునీటి వనరులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వైరా జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 18.4 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 17.4 కు చేరింది. 16 అడుగులు ఉన్న లంకసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం కాగా 14 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వచ్చి చేరిన వరద ప్రవాహంతో కిన్నెరసాని పోటెత్తుతోంది. 12, 500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో చేరగా 2 గేట్లు ఎత్తి 7 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.

ఉప్పొంగిన పెద్దవాగు..

అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ఉప్పొంగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. 0.6 టీఎంసీలకు చేరగా... ఒక గేటు ఎత్తి 2,820 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. తాలిపేరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 2 గేట్లు ఎత్తి 1,350 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. వర్షాల కారణంగా సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తికి ఆంటంకం ఏర్పడింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.