ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తలపెట్టిన సహస్ర చండీయాగం నాలుగో రోజు వైభవంగా జరిగింది. రుత్వికులు, వేదపండితులు ఆధ్వర్యంలో శ్రీనివాస్ రెడ్డి దంపతులు తొలిపూజ నిర్వహించారు. శ్రీ రాజశ్యామలాదేవిని, శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణిగా సువర్ణ మంత్ర పుష్పాంజలితో అర్చించారు. చండీ యాగానికి త్రిదండి చిన్న జీయర్ స్వామికి శ్రీనివాస్ రెడ్డి దంపతులు పూర్ణకుంభంతో స్వాగతించారు. మనం భగవంతుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడమే యజ్ఞం అన్నారు చిన్న జీయర్ స్వామి. గాలి, నీరు, నిప్పు, భూమి, చెట్లు దైవమని పేర్కొన్నారు. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం మన బాధ్యతని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : అంగరంగ వైభవంగా సద్దుల వేడుకలు