ఖమ్మం జిల్లా ఎంకూర్ మండలం తూతక లింగన్నపేట ఆర్సీఎం చర్చి ప్రాంగణంలో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని పేదలకు, వలస కూలీలకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. సుమారు 100 మంది కూలీలకు క్రైస్తవ మత గురువు డేవిడ్ చేతులమీదుగా బియ్యం అందజేశారు.
ప్రజలంతా కరోనా మహమ్మారి పట్ల జాగ్రత్తగా ఉండాలని క్రైస్తవ మత గురువు డేవిడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'కరోనాను నియంత్రించగలమనే ధైర్యం వచ్చింది'