ఖమ్మం జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ కార్మికులు ధర్నా నిర్వహించారు. పంచాయతీరాజ్ కార్మికులను పాఠశాలల్లో మరుగుదొడ్లు కడిగించేందుకు తీసుకొచ్చిన జీవో నెంబర్ 20, 26 వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
జీవోలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు నాల్గో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కథలు చెబుతున్నారు : కేసీఆర్