Gayatri Ravi Nomination: రాజ్యసభ స్థానానికి తెరాస పార్టీ అభ్యర్థిగా గాయత్రి గ్రానైట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి).. నామినేష్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను గాయత్రి రవి సమర్పించారు. నామినేషన్ దాఖలు కంటే ముందు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపానికి రవిచంద్ర నివాళులర్పించారు. నామినేషన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అంతకుముందుగా గాయత్రి రవి నివాసం వద్ద బంధువులు, పార్టీ శ్రేణులతో సందడి వాతావరణం నెలకొంది.
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బండా ప్రకాశ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో.. ఖాళీ అయిన స్థానానికి జరగనున్న ఉపఎన్నికకు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 23న నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవ ఎన్నికను లాంఛనంగా ప్రకటించనున్నారు. గాయత్రి రవి 2024 ఏప్రిల్ వరకు రెండేళ్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు.
ఇవీ చదవండి: రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం కేసీఆర్
రాజీవ్ హత్య కేసు.. పేరరివాళన్ అరెస్ట్ నుంచి విడుదల వరకు ఎన్నో మలుపులు