ఖమ్మం నగరంలో మంచు దుప్పటి కప్పుకుంది. ఉదయం నుంచి నగరంపై పొగమంచు కురవడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది. సమయం 10 అవుతున్నా సూరీడు మబ్బుల చాటునుంచి దోబూచులాడుతున్నాడు.
వాహనదారులు రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు లైట్లు వేసుకొని వెళ్తున్నారు. నగరంలోని బైపాస్ రోడ్డు, శ్రీ శ్రీ కూడలి, ఎన్టీఆర్ సర్కిల్ ఇతర ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు అలుముకుంది.
ఇవీ చూడండి: దావోస్లో కేటీఆర్ బిజీ.. పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు