ETV Bharat / state

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు.. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు - తెలంగాణ తాజా వార్తలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మూడోరోజూ వర్షం కురిసింది. రోజంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ఉభయ జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. వ్యవసాయ పనులకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం జిల్లాలో సగటు వర్షపాతం 19.5 మి.మీగా నమోదైంది. జిల్లాలో 21 మండలాల్లో సాధారణ వర్షం కురిసింది.

ఉభయ జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం.. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు

author img

By

Published : Aug 14, 2020, 9:29 PM IST

Updated : Aug 14, 2020, 9:36 PM IST

ఉభయ జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం.. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు

భారీ వర్షాలతో పూర్వ ఖమ్మం జిల్లా తడిసి ముద్దయింది. ఎడతెరిపి లేని వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. సింగరేణి మండలంలో అత్యధికంగా 28.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 30.3మి.మి. సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా చర్ల మండలంలో 68.4మి.మీల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 12 మండలాల్లో సాధారణ వర్షం కురవగా 4 మండలాల్లో భారీ వర్షం కురిసింది.

భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు

ఎడతెరిపిలేని వర్షాలతో ప్రధాన జలాశయాలకు వరద పోటెత్తుతోంది. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వచ్చి చేరుతున్న భారీ వరదతో భద్రాచలం వద్ద గోదావరి గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గురువారం సాయంత్రం 35.5 అడుగుల నీటి మట్టం ఉండగా.. శుక్రవారం సాయంత్రం 37.3 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ముంపు ప్రాంతాలు అప్రమత్తం

గోదావరి వరద పోటుతో ముంపునకు గురయ్యే తోలట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సెక్టోరియల్ అధికారులు, మండల అధికారులను జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశించారు. గోదావరి వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీచేశారు. గోదావరి ప్రవాహానికి పర్ణశాల వద్ద సీతమ్మ నారచీరల ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది.

తాలిపేరు ఉగ్రరూపం

భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరద ప్రవాహంతో తాలిపేరు ఉగ్రరూపం దాల్చింది. జలాశయంలో 25గేట్లకు గానూ 23 గేట్లు ఎత్తి లక్షా 28 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న చింతవాగు, రోటెంతవాగులు ప్రమాద స్థాయిలో ప్రవహించి తాలిపేరులో కలుస్తున్నాయి. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ప్రాజెక్టు ఈఈ రాంప్రసాద్ వెల్లడించారు. లోతట్టు ప్రాంతాలైన తేగడ, గుంపెనగూడెం, దండుపేట, కేశవపురం గ్రామాలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఖమ్మంలో మున్నేరు ఉద్దృతి మరింత పెరిగింది. కిన్నెరసాని జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతుంది.

ఖమ్మం జిల్లాలో వర్షపాతం నమోదు ఇలా ఉన్నాయి

సింగరేణి 28.2, కామేపల్లి 24.8, రఘునాథపాలెం 18.4, ఖమ్మం గ్రామీణం 20.2, తిరుమలాయపాలెం 25.2, కూసుమంచి 19.8, నేలకొండపల్లి 18.6, ముదిగొండ 20.4చొప్పున వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పినపాక 42.8, చర్లలో 68.4, దుమ్మగూడెం 20.4, అశ్వాపురం 28.2, మణుగూరు 37.2, గుండాల 28.6, ఇల్లెందు 26.6, టేకులపల్లి 22.0, జూలూరుపాడు 26.0, భద్రాచలం 29.6మిల్లీ మీటర్ల చొప్పున వర్షం కురిసింది.

ఇదీ చూడండి: వర్షాలతో తడిసిముద్దైన ఆ రెండు జిల్లాలు

Last Updated : Aug 14, 2020, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.