ETV Bharat / state

Free License Mela in Khammam : ఖమ్మం నగరంలో ఉచిత లైసెన్స్‌ మేళాకు విశేష స్పందన - మంత్రి పువ్వాడ లైసెన్స్​ మేళా

Free License Mela at Khammam : రోడ్డెక్కే వాహనాల సంఖ్య ఏటికేడూ వాహనాలు పెరిగిపోతున్నాయి. కానీ లైసెన్స్‌ లేకుండానే వాహనాలు ఇష్టారాజ్యంగా నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఖమ్మం నగరంలోనే సుమారు 10 వేల మంది డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతున్నట్లు రవాణాశాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉచిత లైసెన్సు మేళాకు శ్రీకారం చుట్టారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 9, 2023, 9:00 AM IST

ఖమ్మం నగరంలో ఉచిత లైసెన్స్‌ మేళా..

Khammam License Mela : ఖమ్మం నియోజకవర్గంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ చేపట్టిన ఉచిత లైసెన్సు మేళాకు విశేష స్పందన లభిస్తోంది. ఆర్థిక మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో విజయవంతంగా చేపట్టిన ఉచిత లైసెన్సుల మేళా కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఖమ్మంలో ఇటీవల ఈ లైసెన్సు మేళాకు శ్రీకారం చుట్టారు. రెండ్రోజుల క్రితం ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పువ్వాడ లైసెన్సు మేళా ప్రారంభించారు.

Minister Puvvada Proving Free License in Khammam : ఈ మేళాకు నగరవ్యాప్తంగా భారీగా యువతీ యువకులు తరలివచ్చి తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. వాహనం కలిగి ఉండి డ్రైవింగ్ లైసెన్సులు లేనివారికోసం ప్రత్యేకంగా స్లాట్ బుక్ చేయించి, ఆ తర్వాత లెర్నింగ్ లైసెన్సు ఇప్పించేలా పువ్వాడ ఫౌండేషన్ బాధ్యత తీసుకుంటోంది. ఖమ్మంలో దాదాపు 10 వేల మంది లైసెన్సులు లేని వారు ఉన్నట్లు గుర్తించామని.. వారందరికీ లైసెన్సు ఇప్పిస్తామని పువ్వాడ అన్నారు. పువ్వాడ ఫౌండేషన్ సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు భరిస్తోందని తెలిపారు.

"నేను నా ఫౌండేషన్​ ద్వారా లైసెన్స్​ ఫీజు భరిస్తామని అనుకుంటున్నాను. టూ వీలర్​ అయితే 300 రుపాయలు, టూ అండ్ ఫోర్​ వీలర్​ అయితే 450రూపాయలు. ఈ లైసెన్స్​ మేళా రెండు నెలలు ఉంటుంది. తీసుకునేవాళ్లు ఖమ్మం వాసులై ఉండాల. లైసెన్స్​ లేకుండా ఎవరు బండ్లు నడపకూడదు. మనం జాగ్రత్తగా నడపాలి మన వల్ల ఎవ్వరి ప్రాణం పోకూడదు, ఇతరుల వల్ల మన ప్రాణానికి ఏమీ జరగకూడదు."- పువ్వాడ అజయ్ కుమార్, రవాణాశాఖ మంత్రి

తొలుత డివిజన్ల వారీగా ఉచిత లైసెన్సు మేళాపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో యువతీ యువకులతోపాటు డ్రైవింగ్ లైసెన్సు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అక్కడే ఆన్ లైన్​లో స్లాట్ బుక్ చేయిస్తున్నారు. ఏళ్లుగా వాహనం నడుపుతున్నా.. నెలల తరబడి తిరగలేక లైసెన్సులపై దృష్టి సారించలేకపోయాయని యువత చెబుతున్నారు

"ఇన్ని రోజులుగా వాహనం నడుపుతున్న మాకు లైసెన్స్​ లైదు. అప్లై చేద్దాం అంటే చాలా ప్రాసెస్​ అని వదిలేశాం. పువ్వాడ అజయ్​ కుమార్​ గారు పువ్వాడ ఫౌండేషన్​ ద్వారా చేపట్టిన కార్యక్రమం వల్ల చాలా మందికి ఉచితంగా లైసెన్స్ వస్తుంది."- దరఖాస్తుదారులు

ఖమ్మం నగరంలో దాదాపు 2 నెలల పాటు ఈ ఉచిత లైసెన్సు మేళా నిర్వహించనున్నట్లు పువ్వాడ ఫౌండేషన్ ప్రకటించింది. ఖమ్మంలో పూర్తయిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగానూ ఈ తరహా ఉచిత లైసెన్సు మేళాలు ఏర్పాటు చేయనున్నట్లు పువ్వాడ ఫౌండేషన్ వెల్లడించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.