ETV Bharat / state

'సిద్ధం కండి.. ఏ క్షణమైనా పిడుగు లాంటి వార్త వినొచ్చు..'

Former Minister Tummala Nageswara Rao comments on Early elections

author img

By

Published : Aug 3, 2022, 4:15 PM IST

Updated : Aug 3, 2022, 4:50 PM IST

16:13 August 03

మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు

Tummala Nageswara Rao comments: రాష్ట్రంలో ఓవైపు మునుగోడు ఉపఎన్నిక.. మరోవైపు ముందస్తు ఎన్నికల గురించి ఆసక్తికర చర్చ నడుస్తోన్న నేపథ్యంలో.. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటించిన మాజీమంత్రి తుమ్మల.. ముందస్తు ఎన్నికల గురించి కార్యకర్తలకు చూచాయగా సిగ్నల్స్​ ఇచ్చారు. కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని.. ఏ క్షణమైనా పిడుగు లాంటి వార్త వినొచ్చని తుమ్మల వ్యాఖ్యానించారు.

గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగానన్న తుమ్మల.. ఈసారి మాత్రం పాలేరుపైనే దృష్టిపెట్టినట్టు స్పష్టం చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధిపైనే దృష్టి పెట్టాన్నారు. ఇప్పుడు కూడా ఆశీర్వదిస్తే మిగిలిన పనులన్ని పూర్తి చేస్తానన్నారు. గతంలో దొర్లిన తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలని కార్యకర్తలకు తుమ్మల సూచించారు.

"సిద్ధం కండి.. ఏ క్షణమైనా పిడుగు లాంటి వార్త వినొచ్చు. గతంలో తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోండి. మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధిపైనే దృష్టి పెట్టా. కార్యకర్తలను పూర్తిస్థాయిలో కలవలేకపోయా. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగా. ఇప్పుడు మాత్రం పాలేరుపైనే దృష్టిపెట్టా." - తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి

ఇవీ చూడండి:

Last Updated : Aug 3, 2022, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.