కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఖమ్మం నగర పాలక సంస్థ అధికారులు సిద్ధం అవుతున్నారు. నగరంలో పలు కూడళ్లలో ముందస్తు చర్యలు చేపట్టారు. తీవ్రంగా మాస్క్‌ల కొరత ఏర్పడటం వల్ల మెప్మా ఆధ్వర్యంలో 5 వేల మాస్కులు తయారు చేయిస్తున్నారు. నగరంలోని పలు డివిజన్లలో దర్జీల చేత మాస్కులు కుట్టిస్తూ.. ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
కొవిడ్-19 వైరస్ నియంత్రణపై అవగాహన కూడా కల్పిస్తున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కొన్ని రోజులపాటు కరచాలనం ఇవ్వొద్దని తెలిపారు. పలు జాగ్రత్తలు పాటిస్తే కరోనా దరిచేరదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : రేవంత్ జైలుకెళ్లింది అందుకోసం కాదు: రాజగోపాల్ రెడ్డి