ETV Bharat / state

అన్నదాతల ఖాతాల్లో లక్షలు కాజేశారట! - khammam district news

తమ పేరిట ఉన్న రూపే కార్డులను మాయం చేసి నగదు కాజేశారని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా తల్లాడలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు రావాల్సిన నగదు ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్​ చేశారు.

farmers protested at thallada in khammam district
రూపే కార్డులు మాయం చేసి నగదు కాజేశారని రైతుల ఆందోళన
author img

By

Published : Jul 8, 2020, 7:06 PM IST

ఖమ్మం జిల్లా తల్లాడలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. తమ పేరిట ఉన్న రూపే కార్డులను తమకు తెలియకుండా మాయం చేసి నగదు కాజేశారని ఆరోపిస్తూ బాధిత రైతులు రెండో రోజు ఆందోళన చేశారు. సంఘం పరిధిలో 1600 మంది సభ్యులుండగా.. 1400 మందికి గతంలో ఉన్న సంఘం బాధ్యుల ద్వారా రూపే కార్డులు మంజూరు చేశారు.

మిగిలిన కార్డులు రైతులకు పంపిణీ చేయకుండా కొందరు వ్యక్తులు కాజేశారని, రూ.10లక్షల వరకు డ్రా చేసినట్లు ఆరోపించారు. వీటిపై ప్రస్తుతం ఉన్న సంఘం సభ్యులతోపాటు సీఈవోను రైతులు ప్రశ్నించారు. ఖమ్మం, వైరా, తల్లాడలోని ఏటీఎంల ద్వారా నగదు కాజేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

కొంతకాలం క్రితం సంఘంలో తెలియపరచగా సీసీ కెమెరాల ద్వారా నగదు డ్రా చేసిన వ్యక్తులను గుర్తించారని... వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ సంఘం కార్యాలయానికి తాళాలు వేసి ధర్నా చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని నిరసన తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు రావాల్సిన నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విచారణ చేసి నగదు డ్రా చేసిన వారిపై పోలీసులకు సమాచారం ఇస్తామని ప్రస్తుతం ఉన్న పాలకమండలి సభ్యులు తెలిపారు. దీంతో రైతులు శాంతించారు.

ఇవీ చూడండి: కేసీఆర్​ ఆరోగ్యంపై హెల్త్​ బులిటెన్​ విడుదల చేయాలి: గూడూరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.