ETV Bharat / state

పట్టాపుస్తకాలు ఇప్పించాలని రైతుల ధర్నా

తమ భూములకు పట్టా పుస్తకాలు ఇప్పించాలని ఖమ్మం జిల్లా పెనుబల్లి రైతులు తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అధికారులు లంచాలు తీసుకుని కూడా సమస్య పరిష్కరించలేదన్నారు.

FARMERS PROTEST IN FRONT OF MRO OFFICE AT PENUBALLI

author img

By

Published : Feb 28, 2020, 7:14 PM IST

ఖమ్మం జిల్లా పెనుబల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. తమ గ్రామంలో అర్హత ఉన్న రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకుండా వీఆర్వో లక్ష్మణ్ రెండేళ్లుగా ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు, అధికారులను ఇప్పటికే చాలాసార్లు కలిసినా... సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు.

చిన్న, సన్నకారు రైతుల వద్ద కూడా... అధికారులు డబ్బులు వసూలు చేశారన్నారు. వారసత్వం, ప్రభుత్వం, పంచరాయి భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. రికార్డులు పరిశీలించి అర్హత ఉన్న రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తానని తహసీల్దార్​ హామీ ఇచ్చారు. అనంతరం రైతులు ఆందోళన విరమించారు.

పట్టాపుస్తకాలు ఇప్పించాలని రైతుల ధర్నా

ఇదీ చూడండి: పరిశోధనల దన్ను లేక ప్రగతి మందగమనం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.