ఖమ్మం జిల్లా చింతకాని మండలం బస్వాపురం సమీపంలోని జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి సర్వేను అడ్డుకున్నారు. మండలంలోని కొదుమూరు, బస్వాపురం, రాఘవపురం, రామకృష్ణాపురం గ్రామాలకు చెందిన రైతులు పెద్దఎత్తున చేరుకొని రహదారిపై బైఠాయించారు. తమ భూములకు మార్కెట్ ధరల ప్రకారం ఎకరానికి రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
రైతులకు సంఘీభావంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పలువురు వామపక్ష నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న ఖమ్మం ఏసీపీ మురళీధర్, వైరా ఏసీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్ మధుసూదన్ సంఘటనా స్థలికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఫలితంగా రైతులు ఆందోళన విరమించారు.
ఇదీచూడండి: బడులు తెరిచే వరకు ‘ఇంటి చదువు'.. త్వరలో ప్రకటించనున్న ప్రభుత్వం