నిరుద్యోగులను మోసం చేసేందుకు మరో కొత్త సంస్థ ఖమ్మంలో వెలుగు చూసింది. ఈసారి మోసగాళ్లు సాంఘిక సంక్షేమ శాఖ గరుకుల పాఠశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేందుకు తెర లేపారు. అభ్యర్థులకు అనుమానం రాకుండా పకడ్బందీగా ముందుకు కదిలారు మోసాగాళ్లు. మోసం గురించి తెలుసుకున్న ఓ నిరుద్యోగి విషయం బయట పెట్టాడు. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్ అనే ఓ నిరుద్యోగి ఎమ్మెస్సీ వరకు చదివాడు. ఇటీవల వార్త పత్రికల్లో ఉద్యోగ ప్రకటన చూశాడు. గ్లోబరీనా అనే సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. సాంఘిక సంక్షేమ శాఖలో పోరుగు సేవల్లో నియమాకం ఉంటుందని తెలిపారు. పరీక్ష సైతం నిర్వహించారు. ముదిగొండలో ఉద్యోగం అని మెయిల్ పంపారు. ఉద్యోగంలో చేరే ముందు లక్ష రూపాయలు కట్టాలని, చేరిన తర్వాత మరో లక్ష కట్టాలని తెలిపారు. ముందు లక్ష కట్టమని తొందర పెట్టారు. అనుమానం వచ్చిన యువకుడు ఈటీవీ భారత్ ప్రతినిధిని కలిశాడు. సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల జిల్లా ప్రాంతీయ అధికారిని సంప్రదించగా నియామక ఉత్తర్వులు అబ్ధదమని స్పష్టం చేశారు. నిరుద్యోగి వద్ద డబ్బులు కాజేసేందుకు పన్నిన పన్నాగంగా తేల్చారు.
ఇవీ చూడండి: నిండుకుండలా మేడిగడ్డ... అన్నారంకు గోదారమ్మ