ETV Bharat / state

విజయ విస్తరణ.. ప్రైవేటు డెయిరీల నుంచి పోటీ తట్టుకునే ప్రయత్నం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది విజయ డెయిరీ ఔట్‌లెట్‌ కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో సంబంధిత అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఖమ్మం నగరంలోని బస్టాండ్‌, రాపర్తినగర్‌, డీఆర్‌డీఏ సమీపంలోని హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌, వైరాతోపాటు మరొక చోట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, భద్రాచలం, కొత్తగూడెం పట్టణం, మణుగూరు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వీటితో పాటు రెండు జిల్లాల్లో మరో 50 పాల సేకరణ కేంద్రాలను కూడా పెంచాలనే యోచనలో ఉన్నారు.

Expansion
విజయ విస్తరణ.. ప్రైవేటు డెయిరీల నుంచి పోటీ తట్టుకునే ప్రయత్నం
author img

By

Published : Sep 29, 2020, 2:14 PM IST

ఈ నెల మొదటి వారం నుంచి విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు అదనంగా రూ.2 చొప్పున చెల్లించనున్నారు. ప్రస్తుతం గేదెపాలు లీటరు రూ.41.72పైసలు కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకంగా లీటరుకు రూ.4 చొప్పున చెల్లిస్తోంది. ఇప్పుడు మరో రూ.2 కలిపింది. ఏపీలోని కృష్ణా జిల్లా సరిహద్దుతో పాటు ఇక్కడ ప్రైవేటు డెయిరీలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విజయ డెయిరీకి పాలసేకరణ చాలా తక్కువ.

ఖమ్మం జిల్లా మధిర, కల్లూరు, వేంసూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలాలు ఆంధ్రా సరిహద్దుల్లో ఉన్నాయి. అక్కడి డెయిరీలే ఎక్కువగా జిల్లాలోని రైతుల నుంచి పాలు సేకరిస్తున్నాయి. దీనికి తోడు ఖమ్మం జిల్లాలో కూడా అధిక సంఖ్యలో ప్రైవేటు డెయిరీలున్నాయి. ఈ పరిస్థితి రాష్ట్రంలో మరే జిల్లాలోనూ లేకపోవటం విశేషం. పోటీ తీవ్రంగా ఉండటంతో విజయ డెయిరీకి పాలు పోసే రైతులు పలుమార్లు ఈ విషయం రాష్ట్ర పాడి పరిశ్రమ సహకార సమాఖ్య అధికారుల దృష్టికి తీసుకెళ్లటంతో ఇప్పుడు అదనంగా లీటరుకు రూ.2 పెంచారు. దీని వల్ల ఉమ్మడి జిల్లాలో పాల సేకరణ కొంత వరకు పెరిగింది.

ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలివీ..

  • పశు దాణా అతి తక్కువ ధరలతో, పాల ఉత్పత్తిదారులకు రాయితీపై అందజేత.
  • పాడి పశువుల ఆరోగ్యం కోసం పశుసంవర్ధకశాఖ, పశుగణాభివృద్ధి సంస్థ సహకారంతో ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరాలు
  • మినరల్‌ మిక్చర్‌ (ఖనిజ లవణ మిశ్రమం), కాల్షియం, దూడలకు, పాడి పశువులకు నట్టల నివారణ మందులను రాయితీపై సరఫరా
  • ప్రతి పాడి పశువుకు సహకార సంఘాల ద్వారా బీమా సదుపాయం
  • ప్రతి పాడి రైతుకు బీమా సౌకర్యం
  • 50శాతం రాయితీపై గడ్డి విత్తనాలు సరఫరా
  • బహువార్షిక పశుగ్రాసాలు, వాటి పిలకలను ఉచితంగా పంపిణీ
  • నాబార్డు, ఐసీఐసీఐ, డీసీసీబీ, ఇతర జాతీయ బ్యాంకుల ద్వారా పాడి పశువులకు రుణ సౌకర్యం
  • జిల్లా పశుగణాభివృద్ధి సహకారంతో పాడి పశువులకు గోపాలమిత్ర ద్వారా కృత్రిమ గర్భధారణ సేవలు
  • పరిశుభ్రమైన పాల ఉత్పత్తి, పరిపూర్ణ పాడి పశువుల పోషణ, మొదలైన వాటిపై శిక్షణ

పాల విక్రయ కేంద్రాలకు ఆహ్వానం...

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విజయ ఔట్‌లెట్‌ కేంద్రాలకు, పాల విక్రయ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇందు కోసం ఖమ్మం నగరంలోని విజయ డెయిరీ ఉపసంచాలకుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

దళారులను నమ్మవద్దు

దళారులను నమ్మొద్దు. విజయ డెయిరీకి పాలు పోసి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను అందుకోవాలి. పలు రకాల రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలను ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందిస్తుంది. ప్రైవేటు డెయిరీలను నమ్మి నష్టపోవద్దు. విజయ డెయిరీ అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పుడు అనేక చర్యలు తీసుకుంటోంది. ఇతర డెయిరీల ప్రలోభాలకు, మోసపూరిత హామీలకు లోనుకాకుండా ప్రభుత్వ డెయిరీకి పాలు పోసి అధిక ధరతోపాటు ఇతర సాంకేతిక వనరులను ఉపయోగించుకోవాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగా విజయ డెయిరీ ఔట్‌లెట్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. పాల సేకరణ పెంపుపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. గోపాల్‌సింగ్‌, ఉప సంచాలకుడు, విజయ డెయిరీ, ఖమ్మం

ఖమ్మం జిల్లాలో విజయ డెయిరీ ఔట్‌లెట్‌

జిల్లాలో పాలసేకరణ (రోజుకు) ఇలా..

  • పాల సేకరణ: 500 లీటర్లు
  • పాల విక్రయాలు: 1000 లీటర్లు
  • పాలు పోసే రైతుల సంఖ్య: 1,000 మంది

ఇదీ చూడండి: వచ్చే నెల 3 నుంచి అందుబాటులోకి ధరణి సేవలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.