కార్పొరేట్ శక్తులు తయారుచేసిన బిల్లును పార్లమెంట్‌లో మోదీ ప్రవేశపెట్టారని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. వారి కోసం రైతుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సీపీఎం ఆధ్వర్యంలో కార్మిక కర్షక పోరుయాత్ర వాహనాన్ని ప్రారంభించారు.
బిచ్చగాళ్లుగా..
రైతు వ్యతిరేక చట్టాలు అమలవుతే అన్నాదతలు బిచ్చగాళ్లుగా మారుతారని అన్నారు. అవి రద్దు చేసే వరకు దేశ వ్యాప్తంగా ఉద్యమం తీవ్రరూపం దాల్చాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు తుమ్మ విష్ణువర్ధన్, కళ్యాణం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'భాజపా అనేకసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది'