Thummala nageswara rao on trs leader murder: దుండగుల దాడిలో దారుణంగా హత్యకు గురైన తెరాస నేత కృష్ణయ్య మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి.. కృష్ణయ్య మృతదేహాన్ని పరిశీలించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. దారుణ ఘటనపై తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తంచేశారు. కార్యకర్తలు ఎవరూ ఎలాంటి చర్యలకు దిగొద్దన్న తుమ్మల.. హత్యా రాజకీయాలు జరిగితే జిల్లా అభివృద్ధి కుంటుపడుతుందని గుర్తుచేశారు. హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
కృష్ణయ్య హత్య ఘటనా బాధాకరం. కార్యకర్తలు ఎవరూ ఎలాంటి చర్యలకు దిగొద్దు. జిల్లా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నాను. హత్యా రాజకీయాలు జరిగితే జిల్లా అభివృద్ధి కుంటుపడుతుందనేది నా భయం. హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలని అధికారులను కోరుతున్నా... - తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి
ఇదీ జరిగింది... సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం నాడే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు, తెరాస నేత తమ్మినేని కృష్ణయ్య దారుణహత్యకు గురయ్యారు. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో బైక్‌పై ఆయన వెళ్తుండగా దుండగులు ఆటోతో ఢీకొట్టారు. అనంతరం ఆరుగురు కృష్ణయ్యపై వేటకొడవళ్లతో దాడి చేసి హతమార్చారు. తెల్దారుపల్లి శివారులోని రోడ్డుపై ఈ ఘటన జరిగింది. కృష్ణయ్య ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్‌గా ఉన్నారు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు.
ఇదీ చూడండి: హత్యకు గురైన తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు