సాంకేతికత ప్రపంచ గమనాన్ని మార్చివేసింది. నిద్ర లేచింది మొదలు అన్ని పనుల్లోనూ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం క్రియాశీలకంగా మారింది. చిన్న చిన్న పనులు మొదలు అత్యంత క్లిష్టమైన, సవాళ్లతో కూడిన పనులను కూడా అత్యాధునిక సాంకేతికల సాయంతో ఇట్టే పూర్తి చేసే వ్యవస్థలు అభివృద్ధి చెందాయి. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన కృతిమ మేధ, బ్లాక్ చైన్ తదితర టెక్నాలజీలు చాలా రంగాల్లో కీలకంగా మారాయి. ప్రభుత్వాలు సైతం సాంకేతికతలను అందిపుచ్చుకొని ప్రజలకు పలు సేవలను సరళంగా, వేగంగా అందిస్తున్నాయి.
ఖమ్మంలో పైలెట్ ప్రాజెక్ట్
స్మార్ట్‌ఫోన్ ఆధారిత ఈ- ఓటింగ్ విధానంపై డ్రై రన్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణ ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఐటీ అండ్ సీ విభాగం, సీడాక్ కలిసి రూపొందించిన ఈ స్మార్ట్ ఫోన్ ఎలక్షన్ విధానాన్ని ఐఐటీ భిలాయి డైరెక్టర్ రాజత్ మూనా అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీ మార్గదర్శకంలో ఈ ప్రాజెక్టును పరీక్షిస్తున్నారు. చరవాణి ఆధారంగా ఈ-ఓటింగ్ చేసే సాంకేతికత అభివృద్ధి ఇప్పటికే పూర్తవ్వగా .. ఇందుకు సంబంధించిన డ్రై రన్‌ను ఒక డమ్మీ ఎలక్షన్ నిర్వహించటం ద్వారా పరీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఖమ్మం జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. అక్టోబరు నెలలో పరీక్షించి ఈ-ఓటింగ్ విధానంలో సవాళ్లు, సమస్యలను గుర్తించనుంది. తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో తీసుకొచ్చిన యాప్‌లో ఓటరు నమోదు పద్ధతిని కూడా పొందుపరిచారు..
అదే తరహాలో ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటుహక్కును సైతం పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా చేతిలోనున్న చరవాణి సాయంతో వినియోగించుకునే విధానం దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో అందబాటులోకి రానుంది. రాష్ట్ర ఐటీశాఖ, సీడాక్ సహకారంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ అప్లికేషన్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఓటరు పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్ళకుండానే ఎన్నికల సంఘం నిర్ధేశించిన రోజు ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. కృత్రిమ మేథ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి సాంకేతికతలతో ఈ-ఓటింగ్ విధానాన్ని రూపొందించారు.
ఈ-ఓటింగ్ విధానంలో కృత్రిమ మేథ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి సాంకేతికతలను వినియోగించనున్నారు. ఈ సాంకేతికతల సాయంతో 3 సార్లు ఓటరు అథెంటిఫికేషన్ చేయనున్నారు. ఓటరు పేరు, ఆధార్, లైవ్ లొకేషన్, ఇమేజ్ మ్యాచింగ్ వంటివి సరిచూడనున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఆన్ లైన్ ఫార్మాట్లో వేసిన ఓట్లు చెరిగిపోకుండా తిరిగి లెక్కించటానికి దోహదపడుతుంది. భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఈ డేటా అంతా స్టేట్ డేటా సెంటర్లో భద్రపరుస్తారు.
ఇదీ చూడండి: E-Vote App: పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఇంటి వద్ద నుంచే ఓటేయొచ్చు!