ఖమ్మం జిల్లా కేంద్రంలో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పెవీలియన్ మైదానం నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ చేసి అనంతరం ధర్నా నిర్వహించారు. జిల్లాలో ఇంతవరకు రైతుబంధు డబ్బులు రాలేదని రైతు రుణమాఫీ కాలేదని తెలిపారు. తెరాస ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ఇవీ చూడండి: 'కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణకు ఓ మకుటాయమానం'