లాక్డౌన్ను పటిష్ఠంగా అమలు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ సూచించారు. ఖమ్మం జిల్లా వైరాలో లాక్‌డౌన్ అమలు తీరును పరిశీలించారు. ఏసీపీ సత్యనారాయణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏసీపీ కార్యాలయాన్ని పరిశీలించి కార్యాలయంలోని మరమ్మతుల విషయంపై పలు సూచనలు ఇచ్చారు.
నియోజకవర్గ పరిధిలో మూడో రోజు లాక్‌డౌన్ ప్రశాంతంగా జరుగుతుందని ఏసీపీ సత్యనారాయణ అన్నారు. పోలీసులు నిత్యం రాత్రింబవళ్లు పహారా కాస్తూ.. రోడ్లపైకి వచ్చే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ వసంత్ కుమార్, ఎస్సై సురేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మే 31న కేరళకు నైరుతి రుతుపవనాలు!