ఖమ్మంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఖిలా బజార్లో ఓ కుటుంబంలో ఐదుగురికి వ్యాధి సోకగా.. తాజాగా ఆ ఇంట్లో వంట మనిషికి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో నగరంలో మొత్తం కరోనా కేసులు ఎనిమిదికి చేరాయి.
బీకే బజారుకు చెందిన ఆ వ్యక్తిని, ఆమె కుటుంబసభ్యులను ఐదు రోజుల ముందే ప్రభుత్వం ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. ఖమ్మంలో బీకే బజారును నాలుగో కంటైన్మెంట్ ప్రాంతంగా ప్రకటించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఇవీ చూడండి: కరోనా వేళ కేంద్రం కోత.. రాష్ట్రాన్ని నడిపేదెట్టా?