ETV Bharat / state

Congress Leaders on Telangana Assembly Elections : 'ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు.. కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం' - ఖమ్మం జిల్లా తాజా వార్తలు

Congress Leaders on Telangana Assembly Elections : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సోమవారం సరికొత్త సన్నివేశానికి వేదికగా మారింది. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న ముగ్గురు ముఖ్య నేతలు ఒకే వేదికపై కనిపించడం ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హస్తం పార్టీలో చేరిన తర్వాత.. తొలిసారి సంజీవరెడ్డి భవన్​కు వచ్చిన సందర్భంగా కార్యకర్తల కోలాహలం కనిపించింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల ర్యాలీలో పాల్గొనడం.. ముగ్గురు కలిసి పార్టీ కార్యాలయానికి రాకతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది.

Khammam district
congress
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2023, 9:20 PM IST

Updated : Sep 25, 2023, 9:50 PM IST

Congress Leaders on Telangana Assembly Elections 2023 : ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్​లో ఆసక్తికర కలయిక.. ఆ పార్టీ శ్రేణులు, నాయకుల్లో నయా జోష్ నింపుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో ప్రత్యర్థి పార్టీలో ఉంటూ ఉప్పూ నిప్పులా ఉన్న ముగ్గురు ముఖ్యనేతలు.. ఒకే పార్టీ కండువాతో పార్టీ కార్యాలయంలో సందడి చేయడంశ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి.. ముగ్గురు నేతలు కలవడం, ముగ్గురు కలిసి తొలిసారి జిల్లా పార్టీ కార్యాలయానికి రావడంతో ఖమ్మం సంజీవరెడ్డి భవన్ సందడిగా మారింది.

గతంలో బీఆర్ఎస్ నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి.. తొలుత కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకున్నారు. ఇటీవలే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో గతంలో భట్టితో (Bhatti vikramarka) రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న నాయకులు.. తుమ్మల, పొంగులేటి పార్టీలో చేరిన తర్వాత ముగ్గురు నేతలు కలిసి.. తొలిసారి జిల్లా పార్టీ కార్యాలయానికి రావడంతో.. శ్రేణులకు ఆ ముగ్గురి కలయిక సరికొత్తగా కనిపించింది.

Congress Ticket War in Palamuru : ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ టికెట్​ దక్కించుకునేదెవరు..?

కాంగ్రెస్​లో చేరిన తర్వాత తొలిసారి ఖమ్మం వచ్చిన తుమ్మల నాగేశ్వరరావుకు.. కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఖమ్మం గ్రామీణం మండలంలోని శ్రీసిటీలో తుమ్మల క్యాంపు కార్యాలయానికి భారీగా వారు తరలివచ్చారు. మధ్యాహ్నం తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి సంభాని సహా పలువురు ఆయనను కలిశారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా తుమ్మల, భట్టి జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి బయలుదేరారు.

ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా ద్విచక్రవాహనాలు, కార్ల ర్యాలీ నిర్వహించారు. నాయుడుపేట చౌరస్తా వద్ద తుమ్మల, భట్టి విక్రమార్క ఓపెన్ టాప్ వాహనంపై కార్యకర్తలకు అభివాదం చేశారు. జూబ్లీక్లబ్ వద్ద వంతెన వద్ద పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి వీరితో జత కలిశారు. తొలిసారి ముగ్గురు నేతలు ఒకే వాహనంలో కలిసి అభివాదం చేయడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఈ సందర్భంగా కార్యకర్తలు పలుచోట్ల నేతలకు పూలాభిషేకం చేశారు.

Congress Bus Yatra in Telangana : బస్సు యాత్రకు కాంగ్రెస్‌ ప్లాన్.. త్వరలోనే రూట్‌మ్యాప్‌, షెడ్యూల్‌

అనంతరం కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు. తొలిసారి పార్టీ కార్యాలయానికి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావుకు నాయకులు ఘన స్వాగతం పలికారు. నేతలు తుమ్మలను శాలువాలతో సత్కరించారు. తుమ్మల నేతలందరినీ ఆత్మీయంగా పలకరించారు. భట్టి, తుమ్మల, పొంగులేటి ఒకేసారి రావడం, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో హస్తం కార్యాలయం కిక్కిరిసిపోయింది. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం, తర్వాత విలేకరుల సమావేశంలో ముగ్గురు నేతలు మాట్లాడారు.

Bhatti vikramarka on MLA Seats : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ పథకాలు, మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనుకునే వారంతా తమ పార్టీలోకి వస్తున్నారన్నారు. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావును సాదరంగా.. హస్తం పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని భట్టి విక్రమర్క అన్నారు.

Tummala Nageswarao on Telangana Assembly Elections 2023 : : జిల్లా నేతలు, కార్యకర్తలంతా కాంగ్రెస్​లోకి రావాలని ఆహ్వానించడం, రాష్ట్ర, జాతీయ నేతల ఆహ్వానం మేరకు.. పార్టీలో చేరానని తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswarao ) పేర్కొన్నారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయం వేదికగా.. హస్తం పార్టీ అభివృద్ధి, కార్యకర్తల కోసం పనిచేస్తానని చెప్పారు. కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు అంతా ఐకమత్యంగా పనిచేద్దామని తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

Telangana Congress Operation Cool : ఆపరేషన్​ కూల్​.. అసంతృప్తులను బుజ్జగించేందుకు కాంగ్రెస్​ నయా ప్లాన్​

Ponguleti Srinivas Reddy on Congress Seats : రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరైనా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేలా కలిసికట్టుగా పని చేస్తామని కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Ponguleti Srinivas Reddy) హామీ ఇచ్చారు. ముగ్గురు ముఖ్యనేతలు కలయిక జిల్లాలో కాంగ్రెస్ మరింత బలోపేతానికి పునాది వేస్తుందని కార్యకర్తలు భావిస్తున్నారు.

Congress Leaders on Telangana Assembly Elections ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి 10 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుంది

Congress Gadapa Gadapa Programme by Pongulti : 'రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్​ని గెలిపించి.. ఆ పార్టీ రుణాన్ని తీర్చుకుందాం'

Ponguleti Srinivas fires on KCR : 'కేసీఆర్‌ దోచుకున్న ప్రతి పైసాను వడ్డీతో సహా కట్టిస్తాం'

Last Updated : Sep 25, 2023, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.