ETV Bharat / state

'ఈ నెల నుంచి భద్రాద్రి థర్మల్​ విద్యుత్​ కేంద్రంలో ఉత్పత్తి' - భద్రాద్రి థర్మల్​ విద్యుత్​ కేంద్రం ప్రారంభమవుతుందని తెలిపిన కేంద్రమంత్రి

ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ నెల నుంచి ఉత్పత్తి ప్రారంభం అవుతుందని కేంద్రమంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో తెరాస ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి... 270 మెగావాట్ల సామర్థ్యంతో ఇక్కడ నాలుగు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

POWER PROJECTS TELANGANA
'ఈ నెల నుంచి భద్రాద్రి థర్మల్​ విద్యుత్​ కేంద్రంలో ఉత్పత్తి'
author img

By

Published : Feb 4, 2020, 11:30 PM IST

ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి థర్మల్​ విద్యుత్​ కేంద్రంలో విద్యుత్​ ఉత్పత్తి ప్రారంభం కానుంది. 270 మెగావాట్ల సామర్థ్యంతో నాలుగు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ఆర్కే సింగ్​ తెలిపారు. ఒక యూనిట్ గతేడాది సెప్టెంబర్​లోనే సింక్రనైజ్ అయిందని.. దాని నుంచి ఈ నెల ఉత్పత్తి ప్రారంభ అవుతందని పేర్కొన్నారు. మిగిలిన మూడు యూనిట్ల ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొదలవుతాయని తెలిపారు.

కేంద్రం నుంచి నిధులు రావు

పనిచేయని కాంట్రాక్టర్ల స్థానంలో కొత్తవారిని నియమించి... పనులు వేగవంతం కోసం ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ అధికారులను పంపుతున్నట్లు చెప్పారు. యాదాద్రి సూపర్ పవర్ ప్రాజెక్టు సివిల్ పనులకు టెండర్లు పిలుస్తున్నామని.. కాంట్రాక్టర్లు ఖరారయ్యేలోపు ప్రత్యామ్నాయ సంస్థల ద్వారా చిమ్నీ, కూలింగ్ టవర్ నిర్మాణ పనులు మొదలుపెడతామని కేంద్రమంత్రి తెలిపారు. 800 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న 5 యూనిట్లు ఈ ఏడాది అక్టోబర్ నుంచి 2021 అక్టోబర్ వరకు ప్రారంభం అవుతాయని స్పష్టం చేశారు. ఇవి రెండు రాష్ట్ర ప్రాజెక్టులే కాబట్టి కేంద్రం ఎలాంటి నిధులు మంజూరు చేయలేదన్నారు.

ఇదీ చూడండి: ఫొటోలు ఎందుకు... లాభాలు కావాలి: సీఎం కేసీఆర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.