నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న భారత్ బంద్ ఖమ్మంలో ప్రశాంతంగా సాగుతోంది. ప్రతిపక్షాల నేతలు తెల్లవారుజామున బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనను కేంద్రం పట్టించుకోవటం లేదని వాపోయారు.
పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు. వాటిని అరికట్టే దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ప్రతి ఒక్కరు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరిన మోదీ