భద్రాచలం రామాలయం చిత్రకూట మండపంలో ఆలయ ఈవో శివాజీ నేతృత్వంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 80 రోజుల ఆదాయం రూ.1,35,41,680 వచ్చినట్లు ఈవో ప్రకటించారు. బంగారం 110 గ్రాములు, వెండి ఒక కిలో 200 గ్రాములు సమకూరింది.
కొందరు విదేశీ భక్తులూ కానుకలు సమర్పించారు. గతేడాది నవంబరు 9న హుండీ ఆదాయాన్ని లెక్కించగా ఐదు నెలలకు సంబంధించి రూ.66.51 లక్షలు వచ్చినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.