ఖమ్మం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉద్యోగుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. డిమాండ్ల పరిష్కారం కోసం భారతీయ బ్యాంకుల సంఘంతో జరిపిన చర్చలు విఫలమైనందున... సమ్మెకు దిగినట్లు ఉద్యోగులు తెలిపారు. వేతన సవరణ, పనిదినాల కుదింపు, మూల వేతనంతో ప్రత్యేక భత్యం విలీనం అంశాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఐబీఏ మొండి వైఖరి వీడాలని ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. సమ్మెతో ఖాతాదారులు, వినియోగదారులకు కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నామని విచారం వ్యక్తం చేశారు. ఐబీఏకు తగు సూచనలు చేసి సమస్యల పరిష్కారమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: రైతు సంక్షేమమే తొలి ప్రాధాన్యంగా 'నిర్మలా' పద్దు