వానాకాలంలో మొక్కజొన్న సాగు వద్దు: కలెక్టర్ కర్ణన్ - రైతుల అభివృద్ధి కోసమే నియంత్రిత సాగు: ఖమ్మం కలెక్టర్
ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురంలో సమగ్ర వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వానాకాలంలో మొక్కజొన్న సాగు చేస్తే దిగుబడి తక్కువగా వస్తుందని, కత్తెర పురుగు ఎక్కువ విస్తరిస్తుందని కలెక్టర్ కర్ణన్ అన్నారు. రైతులు పంట మార్పిడి విధానం పాటించాలని.. పత్తిలో అంతర పంటగా కందిని సాగు చేయాలని సూచించారు.

వానాకాలంలో మొక్కజొన్న సాగు వద్దని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ రైతులకు సూచించారు. నియంత్రిత పంటల సాగు విధానంపై.. ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వానాకాలంలో మొక్కజొన్న సాగు చేస్తే దిగుబడి తక్కువగా వస్తుందని, కత్తెర పురుగు ఎక్కువ విస్తరిస్తుందని కలెక్టర్ అన్నారు. రైతులు పంట మార్పిడి విధానం పాటించాలని.. పత్తిలో అంతర పంటగా కందిని సాగు చేయాలని సూచించారు. రైతుల అభివృద్ధి కోసమే నియంత్రిత సాగు విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని కర్ణన్ అన్నారు.
ప్రభుత్వం సూచించిన పంటలు సాగు చేస్తే లబ్ధి
అనంతరం రైతులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం ప్రభుత్వం రాష్ట్రంలో ఏ పంటలు ఎంతమేరకు ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలో ఒక ప్రణాళిక రూపొందించిందని కర్షకులకు సూచించారు. ఈ ప్రణాళిక ప్రకారం అన్నదాతలు వ్యవసాయ అధికారులు సూచించిన పంటలు సాగు చేసి లబ్ధి పొందాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులకు పెసలు, జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు