ETV Bharat / state

పశువుల పాలిట యమ పాశాలైన విద్యుత్ తీగలు

మేత కోసం వెళ్లిన పశువులు కరెంటు తీగలు తగిలి మృత్యువాతపడ్డాయి. కిందకు వేలాడుతున్న తీగలు పశువుల పాలిట యమ పాశాలుగా మారాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అధికారుల నిర్లక్ష్యమే అని ఆరోపించారు.

పశువుల పాలిట యమ పాశాలు విద్యుత్ తీగలు
పశువుల పాలిట యమ పాశాలు విద్యుత్ తీగలు
author img

By

Published : Jun 22, 2020, 11:17 AM IST

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ఊటుకూరులో విద్యుత్ తీగలు తగిలి 4 గేదెలు, 10 కోతులు మృత్యువాత పడ్డాయి. శివారు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడి ఉన్నాయి. పశువులు మేత కోసం అటువైపు వెళ్లగా.. తీగలకు తగిలి చనిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు.

ANIMALS DIED DUE TO CURRENT WIRES
విద్యుత్‌ తీగలు తగిలి చనిపోయిన కోతులు

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. విద్యుత్ తీగలు కిందకి ఉన్న విషయాన్ని గమనించని వారికి కూడా ప్రమాదకరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి: మందు లేని మాయదారి రోగం కరోనా.. అంటూ పాటతో అవగాహన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.