ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన తెరాస నాయకుడు, ఆశ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు మట్టా దయానంద్ విజయ్‌కుమార్ మూగజీవాల ఆకలి తీర్చి జంతు ప్రేమను చాటారు. పెనుబల్లి మండలం నీలాద్రి అటవీ ప్రాంతంలో ఉంటున్న కోతులకు అన్నం, అరటి పండ్లు, బిస్కెట్లు ఇచ్చి వాటి ఆకలి తీర్చారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో ఇప్పటికే సత్తుపల్లి వ్యాప్తంగా పలు గ్రామాల్లోని పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. ఈ రోజు మూగజీవాల ఆకలి తీర్చి మానవత్వం చాటుకున్నారు.
ఇవీ చూడండి: ఆకాశంలో అద్భుతం.. భానుడి చుట్టూ వలయాకారం