ETV Bharat / state

Anganwadi Workers Protest in Telangana : వేతన పెంపు, క్రమబద్దీకరణ చేయాలని.. రాష్ట్రవ్యాప్తంగా అంగన్​వాడీల నిరసనలు

Anganwadi Workers Protest in Telangana : కనీస వేతనం పాతిక వేలకు పెంపు, ఉద్యోగ క్రమబద్దీకరణ, పని భారం తగ్గింపు వంటి డిమాండ్లతో అంగన్‌వాడీలు సమ్మె బాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ముట్టడికి యత్నించగా.. పోలీసులు కట్టడి చేసే క్రమంలో పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని అంగన్‌ వాడీలు హెచ్చరించారు.

Anganwadi Employee Protest in Sangareddy
Anganwadi Employee Darna in Nizamabad
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 20, 2023, 7:43 PM IST

Anganwadi Workers Protest రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపిన అంగన్​వాడీలు

Anganwadi Workers Protest in Telangana : పలు డిమాండ్లతో అంగన్‌వాడీలు నిరసనలతో హోరెత్తించారు. ఏళ్లుగా పనిచేస్తున్నా.. ప్రభుత్వపరంగా తగిన గుర్తింపు లేదంటూ జిల్లా కలెక్టర్ల ముట్టడికి యత్నించారు. నిజామాబాద్‌లో కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కనీసవేతనం , బీమా సదుపాయం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ అంగన్‌వాడీలు కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చారు. ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అంగన్‌వాడీ(Anganwadi Workers)లంతా ఎస్సై ధనశ్రీని చుట్టుముట్టి ఆమె జుట్టుపట్టి లాగడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. నాయకులను రెండో పట్టణఠాణాకు తరలించగా.. అంగన్‌వాడీలు స్టేషన్‌ను ముట్టడించేందుకు పరుగులు పెట్టారు. వీధి దుకాణంలో బెల్టును తీసి వారిని నిలువరించేందుకు డీఎస్​పీ ఉమేందర్‌ ప్రయత్నించారు. పోలీసులతో బలప్రయోగం చేసి ఉద్యమం అణిచివేయాలని చూస్తున్నారని ఆక్షేపించారు.

  • మహిళా ఎస్ఐని జుట్టుపట్టి లాక్కెల్లిన అంగన్ వాడీలు

    ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడిల ఆందోళన. తమకు కనీస వేతనం 25 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన.

    తోపులాటలో మహిళ ఎస్
    ఐని జుట్టుపట్టి లాక్కెల్లిన అంగన్ వాడీలు. pic.twitter.com/zy8DJ47IYM

    — Telugu Scribe (@TeluguScribe) September 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Anganwadi Staff Strike in Mahabubnagar : అంగన్​వాడీల సమ్మెబాట.. కేంద్రాల్లో నిలిచిపోయిన సేవలు

Anganwadi Workers Darna in Khammam : ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ధర్నా చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జగిత్యాల కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చి నిరసన చేపట్టారు. 11 రోజులుగా సమ్మె చేస్తున్నా.. కనీసం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు ధర్నా నిర్వహించారు. కలెక్టర్ బయటికి రావాలంటూ నినాదాలతో హోరెత్తించారు. కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలోని ఏకశిలా పార్క్ నుంచి వరంగల్ కలెక్టర్ కార్యాలయం(Warangal Collector Office) వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.

"జీతాలు మాకు సరిపోడం లేదు. మా పిల్లలను చదివించాలన్నా ఇబ్బందిగా ఉంది. మా సమస్యలు పరిష్కరించండి. మా రిటైర్​మెంట్​ వయస్సు 60 సంవత్సరాలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ని కోరుతున్నాం. మాకు హెల్త్​కార్డు ఇప్పించండి. సమ్మెలో మేం చేసిన డిమాండ్స్​ అన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం."- అంగన్​వాడీ ఉద్యోగిని

Anganwadi Workers Protest in Sangareddy : సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తామన్నారు. సంగారెడ్డి నాలుగో వార్డులో అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టిన అధికార యంత్రాంగం.. పోషకాహార పంపిణీకి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. సంగారెడ్డిలో సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో భాగంగా కలెక్టరేట్‌ ఎదుట అర్దనగ్న ప్రదర్శన నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్​డీఓ కార్యాలయ ఆవరణలో వేతనాలు పెంచాలంటూ మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన చేపట్టారు.

Anganwadi Demands in Adilabad : అంగన్​వాడీల ఆందోళనల్లో ఉద్రిక్తత.. మహిళలపై చేయి చేసుకున్న పోలీసులు

Anganwadi Teachers and Helpers Retirement Age Increased : అంగన్​వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం గుడ్​న్యూస్​..

'అర్ధరాత్రి లేచి మరీ పని చేస్తున్నాం.. పని భారం తగ్గించండి..'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.