ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో సర్వీస్ పర్సన్స్‌గా పని చేస్తున్న వారికి వేతనాలు పెంచాలని ఖమ్మం డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఏఐసీటీఈ ఆధ్వర్యంలో కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. కొన్నేళ్లుగా పని చేస్తున్న తమకు 2 వేల నుంచి 2,500 వరకు వేతనాలు ఇస్తున్నారన్నారు. కనీస వేతనం 18,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: లంచం అడిగిన తహసీల్దార్‌కు దున్నపోతు బహుమానం!