ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో ఏసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో నేరాల నియంత్రణలో సమాజానికి రక్షణగా ఉంటున్న 100 డయల్ కాల్‌పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 100 డయల్కాల్ను కేత్రస్థాయిలో పటిష్టంగా అమలు పరచాలని విద్యార్థినులు పోలీసులను కోరారు. ఏసీపీ సత్యనారాయణ విద్యార్థినులు ఆపత్కాలంలో వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలను క్షుణ్నంగా వివరించారు.
100 డయల్ కాల్‌ను ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఈ క్రమంలో గురుకుల కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని 100 కాల్ విషయంలో తాము ఎదుర్కొన్న సమస్యను ఏసీపీ దృష్టికి తీసుకెళ్లారు. తాము సమస్యలో ఉండి 100కు కాల్ చేస్తే వారు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ప్రస్తుతం పోలీస్‌శాఖ పటిష్ట చర్యలుచేపడుతుందని ఏసీపీ సమాధానమిచ్చారు.
ఇవీ చూడండి: దశాబ్ది సవాల్: మలి సంధ్యకు ఊతకర్ర అవుదాం