ETV Bharat / state

ఖమ్మం జిల్లాలో 10 ఇసుక లారీలు సీజ్ - ఖమ్మం జిల్లా ఏన్కూరు వద్ద ఇసుక లారీల సీజ్

ఖమ్మం జిల్లా ఏన్కూరు వద్ద పరిమితికి మించి ఇసుక తరలిస్తున్న లారీలను పోలీసులు సీజ్ చేశారు. భద్రాచలం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీలను తనిఖీలు చేయగా.. 5 టన్నుల వరకు ఎక్కువ బరువుతో ఉన్నట్లు తేలింది. కేసు నమోదు చేసి భూగర్భగనుల శాఖ అధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

10 Sand Lorries Siege in Khammam District
ఖమ్మం జిల్లాలో 10 ఇసుక లారీలు సీజ్
author img

By

Published : May 22, 2020, 2:59 PM IST

పరిమితికి మించి ఇసుక తరలిస్తున్న 10 లారీలను ఖమ్మం జిల్లా ఏన్కూరు వద్ద పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీలను తనిఖీలు చేయగా.. 5 టన్నుల వరకు ఎక్కువ బరువుతో వెళ్తున్నట్లు తేలింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి భూగర్భగనుల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

నిత్యం వందలాది లారీలు భద్రాచలం నుంచి ఖమ్మం, హైదరాబాద్‌, సత్తుపల్లి ప్రాంతాలకు వెళ్తున్నాయని పోలీసులు తెలిపారు. తల్లాడ గ్రామం మీదుగా వెళ్లే రహదారితో పాటు ఏన్కూరు నుంచి జన్నారం మీదుగా పల్లిపాడు వెళ్లే రహదారిలోనూ నిత్యం లారీలు అధిక లోడుతో వెళ్తున్నాయని పోలీసులకు సమాచారం అందింది.

లారీలపై నిఘా పెట్టిన పోలీసులు.. ఎస్సై శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా విడిపోయి.. రాత్రి పూట వచ్చే వాహనాలను తనిఖీ చేశారు. పరిమితికి మించి లోడ్ తో ప్రయణిస్తుండటం వల్ల.. రహదారులు నెలల వ్యవధిలోనే దెబ్బతింటున్నాయని తెలిపారు. నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేసి.. కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.