Choppadandi News: కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో గంజాయి మత్తులో యువకులు రోడ్లపై హంగామా సృష్టించారు. అర్ధరాత్రి వాహనదారులను అడ్డుకుని వాదనకు దిగారు. ఇటీవలే చొప్పదండి పట్టణంతో పాటు వివిధ గ్రామాలు సమీప మండలాలైన రామడుగు, గంగాధర మండలాల్లో గంజాయి విక్రేతలను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల నిఘాకు అందకుండా మరికొందరు గంజాయి విక్రేతలు సోషల్ మీడియా సందేశాలతో యువకులకు సరఫరా చేస్తున్నారనే స్థానికులు ఆరోపిస్తున్నారు. గంజాయి లభించని యువకులు కొందరు బొనొఫిక్స్ ద్రావకాన్ని తయారు చేసుకుని సేవిస్తూ అనారోగ్యం పాలవుతున్నారు.
ఇవీ చూడండి: